మోడీ సర్కార్ చేసిన అతి పెద్ద తప్పు ఇదేనా…

-

మన దేశంలో వలస కూలీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా కోట్ల మంది వలస కూలీలు అన్ని రాష్ట్రాల్లో ఉంటున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్ లో కూలి దొరకక, ఈశాన్య రాష్ట్రాల్లో తినడానికి తిండి లేక అక్కడి నుంచి లక్షల మంది కూలీలు.. ఇతర ప్రాంతాలకు వలస వెళ్తూ ఉంటారు. ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలకు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారు.

వీళ్ళు అందరూ కూడా నెలకు మూడు నుంచి ఆరు వేల జీతాలకు పని చేస్తూ ఉంటారు. పది మంది 15 మంది కలిసి… ఇళ్ళల్లో అద్దెకు ఉంటూ రోజు వారీ వేతనం తో బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు అందరికి ఒక్క రోజు పని లేకపోతేనే మరీ దారుణంగా ఉంటుంది పరిస్థితి. సొంత ఊరు నుంచి కనీసం వెయ్యి కిలోమీటర్లు వెళ్ళాలి. బీహార్ నుంచి మన రాష్ట్రాలకు వచ్చిన వాళ్ళు వ్యవసాయ పనులు ఎక్కువగా చేస్తూ ఉంటారు.

వాళ్ళు అందరూ పెద్దగా సంపాదించేది ఏమీ ఉండదు. సగటున అందరూ కూడా రోజు కి 200 మించి సంపాదించే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు కరోనా లాక్ డౌన్ తో రోడ్డున పడ్డారు. వేలాది మంది తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ ని ప్రకటించక ముందు, ఒక ప్రణాళిక సిద్దం చేసుకుని వాళ్ళు అందరిని… కూడా సొంత రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్ళ ద్వారా పంపించాలి.

కాని ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేదు. వలస కూలీలు వేలాది మంది రోడ్ల మీదకు వచ్చి సొంత ఊళ్లకు వెళ్తున్నారు. ఉత్తరప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు మన వద్ద నుంచి నడిచి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నారు. గాయాలు అవుతున్నాయి, ఎండా వాన అనే తేడా లేకుండా నడుస్తున్నారు. వాళ్ల అందరికి కూడా ప్రభుత్వం ధైర్యం చెప్పాల్సింది. ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ ని ప్రకటించారు.

ఈ లాక్ డౌన్ పెంచక ముందు అయినా ఏదోక జాగ్రత్తలు తీసుకుని సొంత ఊర్లకు తరలించి ఉంటే బాగుండేది. ఇప్పుడు కూలీలు అందరూ కూడా ప్రాణాలు కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళను ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆదుకునే పరిస్థితి దాదాపుగా లేదు. కాబట్టి కేంద్రం వాళ్ళ విషయంలో ఏదోక ఆలోచన చేసి ఆదుకోవాలి అని కోరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఒక్కటే కూలీలను ఆదుకునే ప్రయత్నం చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version