మాస్కులు వేసుకోక్కర్లేదు అని ఆదేశాల్ని ఇచ్చిన మొట్టమొదటి దేశం ఇదే…!

-

చైనాలో మొదలైన ఈ కరోనా వైరస్ ఇప్పటికీ కూడా ప్రపంచం లో అందరినీ ఇబ్బందులకు గురి చేస్తోంది. 2019 ఆఖరిలో వూహన్ నుంచి కరోనా వ్యాపించడం మొదలుపెట్టింది. ఇప్పటికె మిలియన్ల మంది జనం కరోనా బారిన పడ్డారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మాస్కులు వేసుకోవడం వల్ల కరోనా రాకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పింది.

ఈరోజు పరిస్థితిని చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు తప్పకుండా ధరించాలి. ఇజ్రాయిల్ లో మాస్కులు ధరించక్కర్లేదు అని ఆర్డర్లు ఇచ్చారు. ఇలా చెప్పిన మొట్టమొదటి దేశం అదే. అవును అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ జనాల్ని మాస్కు ధరించి వద్దని చెప్పారు. 81% అక్కడ ప్రజలు వ్యాక్సిన్ ని వేయించుకున్నారు. ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన తర్వాత జనం మాస్కులు వేసుకోవడం మానేశారు.

అలానే వాళ్ళ యొక్క ఆనందాన్ని సోషల్ మీడియా తో కూడా పంచుకోవడం జరిగింది. 81 శాతం అక్కడ ఉండే ప్రజలు రెండు కరోనా వ్యాక్సిన్ లు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే బయట నుంచి వచ్చే విదేశీయులు కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు.

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా ఏడు కేసులు నమోదయ్యాయని అయితే ఇంకా కరోనా వెళ్ళిపోలేదని ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అన్నారు. మరోసారి కరోనా వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. అయితే అక్కడ ఉండే జనాభా కోటి కంటే తక్కువే. ఇప్పటివరకు ఎనిమిది లక్షల కేసులు కూడా నమోదయ్యాయి. కరోనా వైరస్ కారణంగా అక్కడ ఆరు వేల మంది ఇప్పటికే మరణించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version