జమ్మూ, హర్యానా ఫలితాలపై రాహుల్ గాంధీ రియాక్షన్‌ ఇదే

-

జమ్మూ, హర్యాన ఫలితాలపై రాహుల్ గాంధీ రియాక్ట్‌ అయ్యారు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు రాహుల్ గాంధీ. జమ్మూలో ఇండియా కూటమి సాధించిన విజయం అని పేర్కొన్నారు. రాజ్యాంగ విజయం, ప్రజాస్వామ్య ఆత్మగౌరవ విజయం అని తెలిపారు. హర్యానాలో ఊహించని ఫలితాలపై విశ్లేషిస్తున్నామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.

This is the reaction of Rahul Gandhi on the results of Jammu and Haryana

మద్దతు ఇచ్చినందుకు హర్యానా ప్రజలందరికీ మరియు అవిశ్రాంతంగా పని చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు రాహుల్ గాంధీ. హక్కులు, సామాజిక మరియు ఆర్థిక న్యాయం మరియు సత్యం కోసం ఈ పోరాటాన్ని ఎల్లప్పుడూ కొనసాగిస్తామని వివరించారు. కాగా.. జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్‌ పార్టీ కూటమి విజయం సాధించిన సంగతి తెలసిందే. ఇక అటు హర్యానా రాష్ట్రంలో మాత్రం.. బీజేపీ విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version