హ్యాట్రిక్ విజయం.. హర్యానా సీఎంకు మోడీ అభినందనలు!

-

హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీని ప్రధాని మోడీ అభినందించారు. రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడంలో ముఖ్యమంత్రి సైనీ పాత్ర ఎంతో కీలకం. ఈ క్రమంలోనే బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని హర్యానా సీఎం మర్యాదపూర్వకంగా కలిసిశారు. దీనికి సంబంధించిన ఫోటోలను మోడీ ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. నిన్న విడుదలైన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారి ఘన విజయాన్ని నమోదుచేసింది.

అయితే, సీఎం నయాబ్ సింగ్ సైనీ ప్రధాని మోడీని కలవడం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. మోడీకి శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని ఆయన బహుకరించారు. రాష్ట్రంలో మూడోసారి పార్టీ అధికారంలోకి వచ్చినందుకు హర్షం వ్యక్తం చేసిన మోడీ.. సీఎం నయాబ్ సింగ్‌ను అభినందించారు.వికసిత్ భారత్‌లో హర్యానా కీలక భూమిక పోషిస్తుందని నాకు నమ్మకం ఉందన్నారు. ఆ తర్వాత సైనీ హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు బీజేపీ పెద్దలను కలిశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version