పెళ్లైన స్త్రీల చేతులకి గాజులు తప్పక ఉండాలని పెద్దలు అంటూ వుంటారు. పైగా పెళ్ళైన స్త్రీలు గాజులని తొలగించకుండా రోజు వేసుకుంటారు. అయితే దీని వెనక చాలా పెద్ద కారణంగా ఉంది. అందరికీ ఈ విషయం తెలియదు. మట్టి గాజుల ని స్త్రీలు ధరించడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయట. దాని వెనక అంత పెద్ద అర్ధం ఉందని ఎవరు ఊహించలేరు కూడా. పైగా దీనిలో సైన్స్ కూడా దాగి ఉంది.
మరి ఇక భారతీయ మహిళలు మట్టి గాజులను ఎందుకు ధరిస్తారు అనే విషయాన్ని చూద్దాం. మహిళలు మట్టి గాజులు వేసుకోవడం వలన వేడి తగ్గిపోతుంది. అలానే తక్కువ అలసట కలుగుతుంది కూడా. అయితే మట్టి గాజులాని వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. నీరసం కూడా ఎక్కువగా అనిపించదు. అలానే గర్భిణీ స్త్రీల కి గాజులు పెట్టడం అనే వేడుక అంటారు.
దీన్నే సీమంత వేడుక అని కూడా అంటారు. సీమంతానికి ఎందుకు గాజులు వేస్తారు అనేది చూస్తే.. ఆనవాయితీ ప్రకారం ఐదో నెలలో కానీ ఏడవ నెలలో గర్భిణులకు చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకూ ఉంచుకోవాలని అంటూంటారు. ఇలా వేసుకోవడం వలన అలసట ఉండదు. బిడ్డ బరువు పెరగడం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. కానీ గాజుల వలన ఆ అలసట ఏమి అనిపించదు. అంతేకాదు ప్రసవం వేళ నొప్పిని భరించే శక్తి కూడా ఇవి ఇస్తాయట. అలానే ఒత్తిడి తగ్గిపోయి శక్తి ఉత్పత్తి అవుతుందట.