దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకన్నా కేవలం మహారాష్ట్రలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న విషయం విదితమే. ఇక అక్కడి ముంబై నగరంలోనే కరోనా ఎక్కువ మందికి వేగంగా సోకుతోంది. అయితే మహారాష్ట్రలో ఇతర ప్రాంతాల్లోకన్నా ముంబైలోనే కరోనా వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమేమిటో తెలిసిపోయింది. ముంబైలో కేసుల సంఖ్య విపరీతంగా పెరగడానికి అక్కడి పబ్లిక్ టాయిలెట్లే కారణమని తెలిసింది.
ముంబైలోని ధారవి మురికివాడలో జనాలు ఎక్కువగా పబ్లిక్ టాయిలెట్లనే ఉపయోగిస్తుంటారు. దీంతో ఆ టాయిలెట్ల ద్వారానే ఎక్కువ మందికి కరోనా సోకి ఉంటుందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలకు మొబైల్ టాయిలెట్ల సదుపాయం కల్పిస్తున్నారు. ఇక ముంబైలో 8,613 వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. 343 మంది చనిపోయారు.
ఇక ముంబైలో కరోనా కారణంగా చనిపోయిన వారిలో ఎక్కువగా మురికివాడలకు చెందినవారే ఉన్నారు. వొర్లి, బైకుల్లా, మజ్గావ్, మాతుంగా, ధావరి, కుర్లాల్లో ఉండే మత్స్యకారుల వల్ల కరోనా ఎక్కువగా వ్యాపిస్తుందని నిర్దారించారు.