ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఏం చేయాలన్న కరోనా వైరస్ భయమే కనిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మనం ఎక్కడి నుంచైనా ఇంట్లోకి వచ్చినప్పుడు మన లగేజీ పై కరోనా వైరస్ ఉందేమో అని అనుమాన పడుతూ ఉంటాం చాలా సార్లు. అయితే తాజాగా లగేజీ పై ఉన్న కరోనా వైరస్ ను నాశనం చేసే యంత్రాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏఆర్సీఐ ఆవిష్కరించింది. అతినీలలోహిత కిరణాల ద్వారా… కేవలం 8 సెకన్ల సమయంలోనే 360 డిగ్రీల్లో వైరస్ ను ఈ యంత్రం నాశనం చేస్తుంది.
ముఖ్యంగా విమానాశ్రయాలు రైల్వే స్టేషన్ లో ఉండే కన్వేయర్ బెల్ట్ ఆధారిత యంత్రం లాగే ప్రస్తుతం ఈ వైరస్ ను నాశనం చేసే యంత్రం కూడా ఉంటుంది. ఈ యంత్రంలో లగేజి అటువైపు నుంచి ఇటు వైపుకు వచ్చే క్రమంలో యూవీ కిరణాల ద్వారా లగేజీ పై ఉన్న వైరస్ మొత్తం పూర్తిగా నశించిపోతుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి లో లగేజీల పాత్ర ఎంతో కీలకంగా ఉన్న నేపథ్యంలో… లగేజీ ల పై ఉన్న కంటికి కనిపించని కరోనా వైరస్ ను నాశనం చేయడానికి ఈ అత్యాధునిక యంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది.