ఈ వార్నింగ్ పీక్స్: టి.సర్కార్ పై హైకోర్టు ఘాటు ఘాటు వ్యాఖ్యలు!

-

గతకొన్ని రోజులుగా తెలంగాణలో మరీ విపరీతంగా పెరిగిపొతోన్న కరోనా కేసుల కారణంగా.. తెలంగాణ సర్కార్ పై తీవ్ర విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. అటు ప్రతిపక్షాల నుంచి ఇటు ప్రజల నుంచీ సర్కార్ పై విమర్శలొస్తోన్న నేపథ్యంలో… తాజాగా హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యాలు చేసింది. మొట్టికాయలకు – అభినందనలకూ తేడా లేకుండా ప్రవర్తిస్తున్నారంటూ చురకలు చేసింది!

వివరాళ్లోకి వస్తే… తెలంగాణ క‌రోనా ప‌రిస్థితుల‌పై విచార‌ణ సాగిన అనంతరం స్పందించిన హైకోర్టు… క‌రోనాపై తాము ప‌దేప‌దే ఆదేశిస్తున్నా ఒక్క‌టి కూడా అమ‌లు కావ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘించిన అధికారుల‌పై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవడంలేదో తెలపాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది! క‌రోనా బులిటెన్‌, రోగుల బెడ్ల వివరాలపై అధికారులు కావాల‌నే వాస్తవాలను దాచిపెట్టి కోర్టును, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడింది.

ఈ సంద‌ర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌స్తావ‌న కూడా తీసుకొచ్చింది హైకోర్టు! ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌తో పోల్చితే క‌రోనా ప‌రీక్ష‌ల్లో తెలంగాణ చాలా వెనుక‌బ‌డి ఉంద‌ని మొదలుపెట్టిన కోర్టు… తెలంగాణ‌లో కేసులు పెరుగుతుంటే ప్ర‌భుత్వం మొద్దు నిద్ర‌పోతోంద‌ని.. ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేసింద‌ని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… “కరోనా విషయంలో టి.సర్కార్ ను హైకోర్టు అభినందించింది” అంటూ హెల్త్ బులిటెన్‌ లో పేర్కొనడం ఏమిటి…? తాము మొట్టి కాయలు వేస్తుంటే అభినందించినట్లుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తారా… మొట్టికాయలకు – అభినందనలకూ తేడా తెలియదా అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని కోర్టు నిల‌దీసింది!

న్యాయస్థానలపై దేశంలో ఏకోర్టు, ఏ ప్రభుత్వాన్ని ఈ రేంజ్ లో నిలదీసి ఉండదేమో అన్నా అతిశయోక్తి కాదేమో! కరోనా విషయంలో ప్రశ్నిస్తోన్న మీడియాపైనా, ప్రతిపక్షాలపైనైతే నోరు చేసుకోవచ్చు కానీ… న్యాయస్థానల విషయంలో ఏమి చేయబోతోందో వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Exit mobile version