బాబీ: ఈ నెల 13న బాస్ హిట్టింగ్ తో బాక్స్ బద్దలే..!!

-

బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య’  చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా  ఈ సినిమా 13  రిలీజ్ ని అనౌన్స్ చేశారు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు.

ఈప్రమోషన్స్ కూడా సూపర్ ల్లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట. వాల్తేరు వీరయ్య నుంచి వచ్చిన బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్ గా వీరయ్య టైటిల్ సాంగ్ కూడా వ్యూస్ కొల్లగొడుతోంది.అయితే తాజాగా వాల్తేరు వీరయ్య టీం కున్యూ ఇయర్ సందర్భంగా  చిరంజీవి మంచి పార్టీ కూడా ఇచ్చారు.

ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా కు సెన్సార్ బోర్డు వారు U/A  సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డు సభ్యులు చిరంజీవి సూపర్ గా ఉన్నారని, అలాగే రవితేజ, చిరు కాంబినేషన్లో వచ్చే సీన్లు అదిరిపోయాయి అని మెచ్చుకున్నారట. ఇక డైరక్టర్ బాబీ కూడా సెన్సార్ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ e నెల 13 గాట్టిగా గుర్తు పెట్టుకోండి అని మీకు మ మ మాస్ విందు ఉందని గుర్తు చేశాడు. ఇక చిరు, రవితేజ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version