గుండె ఆరోగ్యానికి ఈ పోషకం ఎంతో అవసరం.. తప్పక వీటిని తినండి..!

-

ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహార పదార్థాలని డైట్ లో తీసుకుంటున్నారు గుండె సమస్యలు ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి. గుండె సమస్యలు రాకుండా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకోవాలి సరైన జీవన విధానాన్ని అనుసరించాలి. డైట్రి నైట్రేట్స్ మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. డైటరీ నైట్రైట్లు సహాయంతో మనకి నైట్రిక్ ఆక్సైడ్ ని తయారు చేయడం జరుగుతుంది నైట్రేట్ అధికంగా ఉంటే మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. దీన్ని ఎలా పొందొచ్చు ఏమేమి తీసుకోవాలనే విషయాన్ని ఇక చూసేద్దాం.

కాలే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా ఇది ఎంతో మేలు చేస్తుంది. కాలేలో నైట్రిక్ ఆక్సైడ్ ఏర్పడడానికి సహాయపడే డైటరీ నైట్రేట్ ఉంటుంది అలానే డార్క్ చాక్లెట్ కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్లు తీసుకుంటే కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలని డార్క్ చాక్లెట్ పెంచుతుంది.

పాలకూర కూడా అందుకు సహాయం చేస్తుంది పాలకూరని ఎక్కువగా తీసుకుంటే సిస్టోలిక్ రక్తపోటు తగ్గుతుంది రక్త పోటు స్థాయిలని పెంచే సోడియం ని తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. సిట్రస్ ఫ్రూట్స్ ని తీసుకుంటే కూడా అనేక లాభాలని పొందవచ్చు. బీట్రూట్ ని కూడా తీసుకోండి. ఇది కూడా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చక్కటి పోషకలని ఇస్తుంది. ఇలా అనేక లాభాలని ఈ ఆహార పదార్థాలతో పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version