అతను పీహెచ్‌డీ చదివాడు.. అయినా ఆటో నడుపుతున్నాడు.. ఎందుకో తెలుసా..?

-

మనం ఎంత పేదరికంలో ఉన్నా సరే.. సమాజంలోని తోటి వారికి సహాయం అందించడం మరువకూడదు.. సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మాడు కనుకనే అతను అంత పెద్ద చదువు చదివినా ఇప్పటికీ ఆటోడ్రైవర్‌గానే జీవిస్తున్నాడు. అతని పేరు కేపీ అజిత్‌. కేరళ వాసి. చిన్నప్పుడు ఇతనికి ఎలాగైనా సరే 10వ తరగతి వరకైనా చదువుకోవాలని ఆశ ఉండేది. కానీ ఆ తరువాత ఎలాగో కష్టపడి డ్రైవింగ్‌ లైసెన్స్‌ తెచ్చుకుని ఆటో కొనుక్కుని దాన్ని నడుపుతూ దానిపై వచ్చే డబ్బుతో ఏకంగా పీహెచ్‌డీ వరకు చదివాడు.

అజిత్‌ ఓ వైపు కాలేజీలో చదువుతూనే మరో వైపు ఆటో నడిపేవాడు. అలాగే కాలేజీ విద్యార్థులకు పలు పాఠ్యాంశాలను బోధించేవాడు. ఈ క్రమంలో తనకు వచ్చే డబ్బుతో చదువుకోవడంతోపాటు తన చుట్టూ ఉన్న పేదలు, వృద్ధులకు సహాయం అందించేవాడు. అలాగే వారిని తన ఆటోలో ఉచితంగా దింపేవాడు కూడా. అలా అజిత్‌ ఎట్టకేలకు పీహెచ్‌డీ పూర్తి చేశాడు. పాపులర్‌ కల్చర్‌ అండ్‌ థియేటర్‌ సాంగ్స్‌ అనే అంశంపై పీహెచ్‌డీ చేశాడు. ఇప్పుడు అతను త్రిశూర్‌లోని సి.అచ్యుత మీనన్‌ ప్రభుత్వ కళాశాలలో గెస్ట్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు.

అజిత్‌ ఓ వైపు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నా.. మరోవైపు సమాజ సేవ మాత్రం మరువలేదు. ఇప్పటికీ విద్యార్థులకు పాఠ్యాంశాలను బోధిస్తుంటాడు. అలాగే వారాంతాల్లో ఆటో నడుపుతూ పేదలు, వృద్ధులకు సేవలు అందిస్తుంటాడు. ఇక అతను ప్రస్తుతం నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ క్లియర్‌ చేసి పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. అతను తన లక్ష్యాన్ని చేరుకోవాలని మనమూ కోరుకుందాం..!

Read more RELATED
Recommended to you

Exit mobile version