కరోనా విజృంభణ తారా స్థాయికి చేరుకుంటుంది.. ప్రతి రోజు వేల కొలదిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాల దగ్గర డబ్బు ఖాళీ అవుతుంది. ప్రజలు ఉద్యోగాలు లేక డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఇలాంటి నేపద్యంలో ఓ స్కూలు యాజమాన్యం ఓ అద్భుతమైన పని చేసింది. తమ స్కూల్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. రెండు నెలల స్కూల్ ఫీజుని మాఫీ చేసింది, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లోని ఏజేసీ పబ్లిక్ స్కూలులో 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ యాజమాన్యం కరోనాతో పోరాడేందుకు ఫండ్ ఇవ్వాలని నిశ్చయించుకుంది. కానీ ఫండ్ ఇవ్వడంకంటే పిల్లల రెండు నెల ఫీజు మాఫీ చేయడం చాలా ఉపయోగకరం అని భావించి తమ స్కూల్ లో చదువుకుంటున్న 800 మంది పిల్లలకు స్కూల్ ఫీజు మాఫీ చేసింది. ఈ విధంగా ఇప్పటికే 8 లక్షల ఫీజు మాఫీ చేయబడిందని స్కూల్ యాజమాన్యం చెబుతుంది. ఈ పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని స్కూళ్ళు ఇలాంటి నిర్ణయంతో ముందుకు రావాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.