ఈ టైం లో గోపీచంద్ కి సినిమా అంటే గొప్ప అవకాశమే ..!

-

టి.కృష్ణ కొడుకుగా తొలివలపు సినిమాతో చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంటరైన గోపీచంద్ మొదటి సినిమాతోనే ఫ్లాప్ ని చూశాడు. దాంతో గోపీచంద్ కి మళ్ళీ సినిమా అవకాశం రాలేదు. దాంతో చాలామంది దర్శక, నిర్మాతల్ని కలిసి అవకాశాలు ఇవ్వమని అడిగేవాడట. అయితే ఏ ఒక్కరు కూడా గోపీచంద్ ని హీరోగా పెట్టి సినిమా తీయడానికి ముందుకు రాలేదు. కొన్నాళ్ళకి తేజ నుండి పిలుపొచ్చింది. వరసగా ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నిజం, జయం సినిమాలలో అవకాశం దక్కించుకున్నాడు. దాంతో ఇండస్ట్రీ దృష్ఠిలో పడ్డ గోపీచంద్ కి ఎం.ఎస్.రాజు నిర్మాతగా ప్రభాస్ త్రిష జంటగా నటించిన వర్షం సినిమాలో అవకాశం వచ్చి మరోసారి విలన్ గా ప్రేక్షకులను మెప్పించాడు.

 

దాంతో గోపీచంద్ తండ్రికి అత్యంత సన్నిహితుడు నిర్మాత పోకూరి బాబురావు గోపీచంద్ యగ్జం సినిమాతో హీరోగా మళ్ళీ అవకాశం ఇచ్చాడు. ఏ.ఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ ని అందుకుంది. ఆ తర్వాత గోపీచంద్ ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా మంచి హిట్ సినిమాలలో నటించారు. రణం, లక్ష్యం, లౌఖ్యం, ఇలా చాలా సినిమాలతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఉన్నపలంగా గోపీచంద్ కి వరసగా ఫ్లాప్స్ రావడం మొదలయ్యాయి.

దాంతో హీరోగా క్రేజ్ తగ్గిపోయింది. మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. 2019 లో చాణక్య సినిమా తర్వాత మళ్ళీ గోపీచంద్ సినిమా రాలేదు. ప్రస్తుతం సీటీమార్ సినిమా చేస్తున్నాడు గోపీచంద్, తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపీచంద్ కబడ్డీ కోచ్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న మరో సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. బిను సుబ్రమణ్యం దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుండి ప్రారంభం కానుందట. అయితే ఇలాంటి సమయంలో గోపీచంద్ మరో సినిమా రావడం అంటే గొప్ప విషయమే అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version