కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంది. అగ్ర దేశాలు సైతం కరోనా దెబ్బకు తలలు పట్టుకుంటున్నాయి. ఇది ఏ రకంగా ముంచుకొస్తోంది అనేది అర్దం కాక శాస్త్రవేత్తలు విస్తృత స్థాయిలో పరిశోధనలు చేస్తున్నారు. ఒక పక్క కరోనా బారిన పడిన వారికి వైద్యం అందిస్తూనే, మరోపక్క ఈ మహమ్మారి నుండి ప్రజలను రక్షించేందుకు మందు కనిపెట్టే పనిలో నిమగ్నమైఉన్నారు.
కొవిడ్ చికిత్సకు అమెరికా కంపెనీ ‘గిలీద్’ ఉత్పత్తిచేసిన ‘రెమెడిసివిర్’ సత్ఫలితాలను ఇస్తున్నట్టు ప్రయోగ పరీక్షల్లో వెల్లడైంది అని ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ఓ వ్యాసం ప్రచురితమైంది. అయితే దీనిపై ఓ నిర్ధారణకు రాలేమని, రోబోయే రోజుల్లో ఫలితాలు పూర్తిస్థాయిలో వస్తాయని కూడా వివరించింది.
ఈ మందును వాడిన తర్వాత అమెరికా, ఐరోపా, కెనడా, జపాన్‌లో తొలుత మెకానికల్ వెంటిలేటర్లపై ఉన్న వారిలో 68% మందికి శ్వాసమెరుగై కోలుకున్నారు. వారిలో సగం మందికి పైగా వెంటిలేటర్ పైపులను తొలగించారు. మరియు ఆక్సిజన్ థెరపీ తీసుకుంటున్న మరో నలుగురి పరిస్థితీ మెరుగైంది. అయితే ఈ పరీక్షలో కొంతమంది మృతి చెందడం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి తీవ్రమైన దుష్పరిణామాలూ కూడా వెలుగుచూశాయని అందులో పేర్కొన్నారు.