వావ్‌.. ఈ సారి రిపబ్లిక్‌ డే సెలబ్రేషన్స్‌ ఎంతో స్పెషల్‌..

-

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. ఆ తర్వాత మన స్వాతంత్ర్య దేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని నిర్మించిచుకోవాలని.. అప్పట్లో డా.బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించిందో కమిటీ. ఆ రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న అమోదించగా.. దాన్ని 1950 జనవరి 26 నుంచి అమలు చేశారు. దీంతో అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్య, సార్వభౌమ, గణతంత్ర దేశంగా ఎదిగింది. అప్పటి నుంచి జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. అయితే ఈ సారి.. సామాన్యుల రిపబ్లిక్​ డేను మనం ఢిల్లీ గడ్డపై చూడబోతున్నాం. ఈసారి దేశ రాజధానిలో జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలు.. ఇంతకుముందు వాటి కంటే వెరీ డిఫరెంట్​.

 

ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్​ లో మెయిన్​ డయాస్​ ఎదుట ఉండే తొలి వరుసలో కూర్చోబోయే స్పెషల్​గెస్ట్స్​ జాబితాలో రిక్షావాలాలు, తోపుడు బండ్లపై కూరగాయలు అమ్ముకునేవారు, నిర్మాణ రంగ కార్మికులు, చిరువ్యాపారులు ఉన్నారు. ‘పార్టిసిపేషన్​ ఆఫ్​ ది కామన్​ పీపుల్’ థీమ్​ తో ఈ ఏడాది రిపబ్లిక్​ డేను జరుపుకుంటున్న నేపథ్యంలో సామాన్యులకు ముందువరుసలో కూర్చునే అవకాశాన్ని కల్పించారు. పార్లమెంటు సెంట్రల్​ విస్టా, కర్తవ్య పథ్​నిర్మాణ పనుల్లో పాల్గొన్న కార్మికులు, వారి కుటుంబ సభ్యులతో పాటు రిక్షావాలాలు, చిరువ్యాపారులు, కూరగాయలు అమ్ముకునేవారిని జనవరి 26న వీవీఐపీ కుర్చీల్లో మనం చూడబోతున్నాం. ఆయా విభాగాల నుంచి ఎంపిక చేసిన వారందరికీ ఇప్పటికే ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. ఈసారి రిపబ్లిక్​ డే కార్యక్రమానికి ఈజిప్ట్​ అధ్యక్షుడు అబ్దెల్​ ఫత్తా అల్​ సీసీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈజిప్ట్​ కు చెందిన 120 మంది సభ్యుల సైనిక బృందం కూడా పరేడ్​లో ప్రదర్శన ఇవ్వనుంది. 19 దేశాలకు చెందిన 166 మంది క్యాడెట్లు, 32 మంది ఆర్మీ ఆఫీసర్లు పరేడ్​ లో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version