రెండిటికి చెడ్డ రేవ‌డిలా మారిన వైసీపీ సీనియ‌ర్‌…!

-

కడప జిల్లాలోని ఫ్యాక్షన్ నియోజకవర్గం ఆయన జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీమంత్రి రామ సుబ్బారెడ్డి పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడిలా మారింది. ఆయన వైసీపీలోకి వచ్చి ఆరు నెలలు కూడా కాకుండానే తీవ్ర సమ్మతి ఎదుర్కొంటున్నారా ? అంటే అవుననే చర్చలు కడప జిల్లా రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. గతంలో జమ్మలమడుగులో టీడీపీ నుంచి వరుస విజయాలు సాధించి మంత్రి అయిన రామ సుబ్బారెడ్డి… 2004 నుంచి 2019 ఎన్నికల వరకు వరుసగా నాలుగు సార్లు టిడిపి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

గత ఎన్నికల్లో చంద్రబాబు రామసుబ్బారెడ్డికి చిరకాల రాజకీయ శత్రువుగా ఉన్న‌ ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేర్చుకుని ఆయనకు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు… ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ సీటు ఇచ్చి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. ఎన్నికల్లో వీరిద్దరూ ఓడిపోయారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆదినారాయణ రెడ్డి బిజెపి కండువా క‌ప్పుకుంటే… రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చారు. అయితే వైసీపీ లోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ‌ర్సెస్‌ రామసుబ్బారెడ్డి మ‌ధ్య‌ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.

సుధీర్ రెడ్డితో గొడ‌వ‌లు స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి రామ‌సుబ్బారెడ్డికి నియోజ‌క‌వ‌ర్గంలో గుర్తింపే లేకుండా పోయింద‌ట‌. నియోజ‌క‌వ‌ర్గంలో మూడు బ‌ల‌మైన వ‌ర్గాలు త‌యార‌య్యాయి. ఓ వైపు ఆదినారాయ‌ణ రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గాల‌తో ఇప్ప‌టికే జ‌మ్మ‌ల‌మ‌డుగు ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు అట్టుడుకుతుంటే.. ఇప్పుడు ఈ రెండు వ‌ర్గాల‌కు తోడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వ‌ర్గం కూడా తోడైంది. రామ‌సుబ్బా రెడ్డి పార్టీ మారినా నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే వ‌ర్గం ఆయ‌న్ను, ఆయ‌న వ‌ర్గాన్ని గ‌ట్టిగా టార్గెట్ చేసింది.

మూడున్న‌ర ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్ర ఉన్నా కూడా రామ‌సుబ్బారెడ్డి నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ సీనియ‌ర్ నేత‌గా ఆయ‌న‌కు గుర్తింపు లేక‌పోవ‌డంతో ఆయ‌న టీడీపీలో ఉన్నా ఆ గౌర‌వం అయినా ఉండేద‌న్న చ‌ర్చ‌లు ఆయ‌న వ‌ర్గంలో వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు రామ‌సుబ్బారెడ్డి ప‌రిస్థితి వైసీపీలో ఉండ‌లేక ? బ‌య‌ట‌కు రాలేక అన్న‌ట్టుగా మారింది. అయితే జ‌గ‌న్ సుధీర్‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి మ‌ధ్య పంచాయితీ బాధ్య‌త‌ల‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డికి అప్ప‌గించారంటున్నారు. మ‌రి ఆయ‌న ఈ పంచాయితీ ఎలా స‌ర్దుబాటు చేస్తారో ?  చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version