కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడు నెలలుగా ఇంటికే పరిమితం అయినా సిని హీరోలు..తమ కుటుంబ సభ్యులు,పిల్లలతో బిజిగా గడుపుతున్నారు.. సమయం దొరికి నప్పుడు కరోనా మహమ్మారిపై ఎప్పటికప్పుటు అభిమానులకు సూచనలు చేస్తున్నారు..తాజాగా స్టైలిష్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సరదాగా గడుపుతూ ఆ ఆనంద క్షణాలని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తున్నారు.. బన్నీ పిల్లలు అయాన్, అర్హాలు టీవీ చూస్తూ ఫన్నీగా డ్యాన్స్ లు చేశారు..అయాన్, అర్హాల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోని అల్లు అర్జున తన ఇన్‌స్టాగ్రామ్‌లో ద్వారా షేర్ చేస్తూ.. `ఫ్రైడే నైట్ డ్యాన్స్ పార్టీ` అనే కామెంట్ పెట్టారు. ఇది నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.