టీడీపీలో మిగిలింది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలేనా…?

-

టీడీపీ అధికారం కోల్పోయి కరెక్ట్ గా ఆరు నెలలు అయింది. ఐదేళ్లు అధికారంలో ఉండి ఊహించని విధంగా ఘోర ఓటమి పాలైన టీడీపీ ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది. అయితే ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి ఈ ఆరు నెలల కాలం పెద్దగా కలిసిరాలేదనే చెప్పొచ్చు. ఓ వైపు ఓటమి దెబ్బకు నేతలు సైలెంట్ అయిపోవడం, మరోవైపు కొందరు నేతలు టీడీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదని ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇలా కష్టాల్లో ఉండటం వల్ల వైసీపీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకిత వచ్చిన దాన్ని ఉపయోగించుకోలేని స్థాయిలో టీడీపీ ఉండిపోయింది.

అయితే పార్టీ సంగతి పక్కనబెడితే ఆ పార్టీ తరుపున గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేల పనితీరు కూడా సరిగా లేదనే చెప్పాలి. ఎవరికి వారే యమునా తీరే అంటూ వ్యవహరించడం వల్ల గెలిచిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ వీక్ అయ్యే స్టేజ్ కి వెళ్లిపోయింది. కాకపోతే ఇద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు. పర్చూరు నుంచి గెలిచిన ఏలూరి సాంబశివరావు, పాలకొల్లు నుంచి గెలిచిన నిమ్మల రామానాయుడు ప్రతిరోజూ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలని పరిష్కరించడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

అటు పార్టీని బలోపేతం చేయడంలో కూడా వీరు ముందున్నారు. తమకు ఓట్లు వేసి గెలిచిపించిన ప్రజల కోసం వీరు నిత్యం ఏదొకటి చేయాలనే తపనతో పని చేస్తున్నారు. వీరితో పోలిస్తే నియోజకవర్గాల్లో మిగతా ఎమ్మెల్యేలు సరిగా లేరు. చంద్రబాబు అధినేత కాబట్టి ఆయనకు కుప్పం వెళ్ళే తీరిక ఉండదు. అటు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉన్నారు. పి‌ఏ‌సి ఛైర్మన్ గా ఉన్న పయ్యావుల కేశవ్, సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీలు అనారోగ్యంతో యాక్టివ్ గా ఉండటం లేదు. ఇక వల్లభనేని వంశీ ఇప్పటికే టీడీపీని వీడగా, గంటా శ్రీనివాసరావు, కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ మరికొందరు ఎమ్మెల్యేలు పార్టీ వీడతారని వార్తలు వస్తున్నాయి. అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కూడా పెద్దగా పనిచేస్తున్నట్లు కనిపించడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version