నమ్మిన వారికి క్రెడిట్ కార్డ్ ఇవ్వండి… ఎందుకంటే…!

-

క్రెడిట్ కార్డ్… ఈ రోజుల్లో దీనికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. బయట అప్పులు చేయడం ఇష్టం లేని వారు బ్యాంకింగ్ ద్వారానే అప్పుని పొందాలని చూస్తున్నారు. ఇందుకోసం ప్రధానంగా క్రెడిట్ కార్డ్ మీద ఆసక్తి చూపించి వాటిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న జీతాలు ఉన్న వారు కూడా క్రెడిట్ కార్డ్ వైపు మొగ్గు చూపించడంతో బ్యాంకు లు కూడా అందుకు తగిన విధంగా ఆఫర్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో చాలా మందికి ఇవి అండగా నిలుస్తున్నాయి.

అయితే క్రెడిట్ కార్డ్ తీసుకునే వాళ్ళల్లో కొంత మంది వాడుతున్నారు మరి కొంత మంది భయపడి వాటికి దూరంగా ఉంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు అంటున్నారు నిపుణులు. క్రెడిట్ కార్డ్ ఉంటే దాన్ని సక్రమంగా వాడితే మంచిది అంటున్నారు. ఒకవేళ మీరు వాడకపోతే మీకు అత్యంత నమ్మకస్తులకు ఇవ్వమని సూచిస్తున్నారు. దాని వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. ఎవరికి అయినా ఈఎంఐ అవసరం ఉంటే ఇవ్వాలని… వాళ్ళు సక్రమంగా కడితే మీకు క్రెడిట్ స్కోర్ క్రమంగా పెరుగుతుందని,

మీరు వాడకుండా ఉంటే కార్డ్ పరిమితి తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుందని, ఇలా చేస్తే భవిష్యత్తులో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని రుణపరిమితి పెరిగితే భవిష్యత్తులో మీకే ఉపయోగమని అంటున్నారు. చాలా మంది పక్కని వారికి ఇవ్వడానికి భయపడతారని, అయితే నమ్మకస్తులకు మాత్రం ఇవ్వొచ్చని, భవిష్యత్తులో వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, గృహ రుణాలు కావాలి అంటే ఈ స్కోర్ కూడా చూస్తారని సూచిస్తున్నారు. ఉదాహరణకు 30 వేలు పరిమితి తో మీకు క్రెడిట్ కార్డు ఇస్తే…

దానిని మీరు క్రమంగా వాడటం, చెల్లింపులు సరిగా చేస్తే… భవిష్యత్తులో లక్ష వరకు పరిమితి పెంచుతారని, ఇక మరిన్ని కార్డులు కూడా తీసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇతర బ్యాంకు లు కూడా కార్డ్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తాయని, కాబట్టి వాడకుండా మాత్రం ఉండొద్దని అంటున్నారు. వాడకుండా అలా పెట్టుకోవడం ద్వారా మీకు ఆసక్తి లేదని భావించే బ్యాంకులు… మీకు భవిష్యత్తులో ఋణం ఇచ్చే విషయంలో కూడా ఆలోచిస్తాయని అంటున్నారు. కాబట్టి క్రెడిట్ కార్డ్ వాడకుండా ఉండొద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version