50 నోటు కిందపడిందని చెప్పి లక్ష రూపాయలు కొట్టేసిన కేటుగాళ్లు

-

చెన్నై, ఆవడి సమీపంలోని అంబికా పురానికి చెందిన త్యాగరాజన్ భవన నిర్మాణ కాంట్రాక్టర్. ఇతను తాకట్టు పెట్టిన నగలని విడిపించడానికి రూ.లక్ష తో ఇంటి నుంచి శుక్రవారం మధ్యాహ్నం తిరునిండ్రవూర్ లో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కు బయలుదేరాడు. అతను తిరువల్లూరు- చెన్నై జాతీయ రహదారి పై అతని వెంబడించిన నలుగురు వ్యక్తులు త్యాగరాజన్ తో” మీ జేబులో ఉన్న 50 రూపాయల నోటు కింద పడింది అని తెలిపారు”

. దీంతో అతడు బైకును రోడ్డు పక్కన నిలిపి 50 రూపాయలు తీసుకొని తిరిగి రాగా ఇంతలో బైక్ లో ఉంచిన రూ.లక్ష కనిపించలేదు. దీంతో తిరునిండ్రావూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ కెమెరాల ను పరిశీలించారు. అందులో నలుగురు వ్యక్తులు బాధితుడి దృష్టిని మళ్లించి రూ.లక్ష నగదు చోరీ చేసి పారిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version