అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన వారు అవినీతిలో కూరుకుపోయారని పేర్కొన్నారు. తాజాగా బీజేపీ విజయోత్సవ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ మునిగిపోవడమే కాకుండా వారి మిత్రులను కూడా ముంచేస్తోందని తెలిపారు. లక్ష మంది యువతను రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దుతామన్నారు. యమునాలో విషం కలిపారంటూ హర్యానా ప్రభుత్వం పై తప్పుడు ఆరోపణలు చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నాహజరే ఎంతో పోరాడారు. ఢిల్లీ ఫలితాల్లో కాంగ్రెస్ 0 హ్యాట్రిక్ కొట్టింది అన్నారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను మిత్రులను కూడా గ్రహించారు. ఢిల్లీని వాయు కాలుష్యం పట్టి పీడిస్తోంది. యమునా నదిని ఆప్ ప్రభుత్వం అపవిత్రం చేసింది అన్నారు. ఎంత కష్టమైనా యమునాను ప్రక్షాళన చేసి తీరుతామని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు. ఓటముల విషయంలో కాంగ్రెస్ కి గోల్డ్ మెడల్ ఇవ్వవచ్చని తెలిపారు. కొత్తగా గుడులకు వెల్తున్న వారిని.. పూజలు చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కొత్త తరం నాయకులకు బీజేపీ పెద్ద పీట వేస్తోందని తెలిపారు.