24 గంటల్లో మళ్ళీ వెయ్యి కరోనా కేసులు…!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ప్రతీ రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఏ విధంగా నమోదు అవుతున్నాయి. ఎక్కడి నుంచి నమోదు అవుతున్నాయి లాక్ డౌన్ ప్రకటించినా సరే… అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. గత 24 గంటల్లో కరోనా కేసులు దేశ వ్యాప్తంగా వెయ్యికి పైగా నమోదు అయ్యాయి.

ఇక మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 377 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కరోనా కేసులు 2500 దాటాయి. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణాలో కేసులు పెరిగాయి. 644 కేసులు నమోదు అయ్యాయి. ఏపీలో 24 గంటలలో 44 కేసులు నమోదు కావడంతో 483 మంది కరోనా బారిన పడ్డారు.

అత్యధికంగా గుంటూరు జిల్లాలో ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయి. 114 కేసులు నమోదు అయ్యాయి ఆ జిల్లాలో. ఇక కేంద్రం లాక్ డౌన్ ని మే 3 వరకు పెంచిన సంగతి తెలిసిందే. ఇక కరోనా పరిక్షలు కూడా వేగంగా జరగాల్సిన అవసరం ఉందనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. రాబోయే రెండు వారాలు దేశానికి చాలా కీలకం కాబట్టి పరిక్షల సంఖ్య ను పెంచాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. అయితే మన దేశంలో కిట్స్ కొరత ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version