తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ పై రాహుల్ గాంధీ స్పందించారు. ‘గత ప్రభుత్వం ఇంటెలిజెన్స్, పోలీసు విభాగాలను దుర్వినియోగం చేసి వేల మంది ఫోన్లను ట్యాప్ చేసింది అని ఆరోపించారు.తుక్కుగూడలో జరుగుతున్న జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ప్రభుత్వం మారగానే ఆ డేటాను ధ్వంసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి పని చేశారో ఢిల్లీలో ప్రధాని కూడా అదే పని చేస్తున్నారు అని అన్నారు. బీజేపీ ఓ వాషింగ్ మెషీన్. దేశంలో అత్యంత అవినీతిపరులు మోదీతో ఉన్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల సంఘంలోనూ మోదీ తొత్తులున్నారు’ అని ఆరోపించారు.
తెలంగాణలో బీజేపీ B టీంను ఓడించామని.. వచ్చే ఎన్నికల్లో మోదీని ఓడిస్తామని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. ‘కాంగ్రెస్ ఖాతాలను బీజేపీ నిలిపివేసింది. మోదీ దగ్గర ధనం, ఈడీ, సీబీఐ, ఐటీ ఉంటే.. మాకు ప్రజల ప్రేమ తోడుగా ఉంది అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం ఎలక్టోరల్ బాండ్స్. ముందు సీబీఐ బెదిరిస్తుంది… వెంటనే ఆ కంపెనీ బాండ్లు కొంటుంది. రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ యోచిస్తోంది .మేం రద్దు కానివ్వం’ అని రాహుల్ గాంధీ అన్నారు.