మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ కి బెదిరింపు కాల్స్..!

-

గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. బెదిరింపు కాల్స్ వచ్చిన ఫోన్ నంబర్లకు సంబందించిన కాల్ లిస్ట్ స్క్రీన్ షాట్ ను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ రోజు మరోసారి తనకు అనేక నంబర్ల నుండి హత్య బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు.

తాను ఇలాంటి బెదిరింపులకు గురికావడం ఇది మొదటిసారి కాదని, వీటిపై గతంలో కూడా ఫిర్యాదు చేశాననీ, అయినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోందని అన్నారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పౌరుడిగా ఈ పరిస్థితిని పోలీసు శాఖకు తెలియజేయడం బాధ్యతగా భావిస్తున్నానని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా గోషామహాల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ ను హత్య చేస్తామని గతంలో కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఆయన పలు మార్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version