హ్యారీపోటర్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్‌కు బెదిరింపులు!

-

హ్యారీపోటర్ నవలా రచయిత్రికి బెదిరింపులు వచ్చాయి. బ్రిటిష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్ (57 ఏళ్లు)కు పాకిస్తాన్ చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. తీవ్ర వేదనకు గురయ్యాను.. ఆయన క్షేమంగా ఉండాలని ట్విట్ చేశారు. దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ అనే వ్యక్తి హెచ్చరికలు జారీ చేశాడు.

జేకే రౌలింగ్‌

‘కంగారు పడొద్దు.. ఆ తర్వాత నువ్వే..’ అని బెదింపులకు పాల్పడ్డాడు. జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, విద్యార్థిగా తనకు తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version