ఒడిశా రాష్ట్రంలోని దెంకనల్ జిల్లా చౌలియా ఖమర్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు వ్యక్తులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వారు చనిపోయి రెండ్రోజులు గడిచినట్లు సమాచారం. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు ఇంటికి దూరంగా ఉంటున్న పెద్ద కుమారుడికి ఫోన్ చేశారు.

అతడు వచ్చి చూడగా తన తండ్రి, బావమరిది, అత్తయ్య వేర్వేరు గదుల్లో ఉరేసుకుని వేలాడుతూ కనిపించారు. వివరాల్లోకివెళితే.. ఆ ఇంటి పెద్ద కొడుకు ప్రసన్న కుమార్ దాస్ కొన్ని కారణాల వల్ల సుమారు 30 ఏళ్లుగా ఇంటికి దూరంగా ఉంటున్నాడు. తన తల్లికూడా అతనితోనే ఉంటుంది. ఇక్కడ మాత్రం తన తండ్రి శంకర్షన్ (70), అతని 45 ఏళ్ల సోదరి సుబార్నా, ఆమె కుమారుడు సంతోష్ (18)ఉంటున్నారు. కారణం ఏమిటీలో తెలీదు. కానీ ముగ్గురు ఒకే సారి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇల్లు గ్రామానికి దూరంగా ఉండటంతో వారు ఎలా చనిపోయారో తెలియదని స్థానికులు చెబుతున్నారు.