పెద్దపల్లి ఆర్టీవో కార్యాలయం వద్ద లారీ ఎక్కి విద్యుత్ తీగలు పట్టుకుని ఆత్మహత్యచేసుకునేందుకు ఓ లారీ ఓనర్ ప్రయత్నించాడు. మాములు ఇవ్వలేదని తన లారీ మీద ఆర్టీవో అధికారులు తప్పుడు కేసులు పెట్టారని సదరు లారీ యాజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఒక్కో లారీకి నెలకు రూ.8000 లంచం డిమాండ్ చేస్తున్నారని, డబ్బులు ఇవ్వలేదని తన లారీ మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారని బసంత్ నగర్‌కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ వాపోయాడు. తన వద్ద అన్ని ధృవపత్రాలు సరిగా ఉన్నా కూడా కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. అధికారులు లారీ విడిపించలేదని ఈ క్రమంలోనే లారీ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు సమాచారం.కాగా, ఈ విషయంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని లారీ ఓనర్ డిమాండ్ చేశాడు.
https://twitter.com/telanganaawaaz/status/1890956850717200602