ఏపీలో విషాదం.. జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతు

-

ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సాధారణంగా అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలో పచ్చని ప్రకృతి ఒడిలో పాల నురగలతో పరవళ్లు తొక్కే జలతరంగిణి జలపాతం చూడటానికి పర్యాటకులు వస్తుంటారు. ఎంతో సుందరమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో కేరింతలు వేసుకుంటూ యువత ఆనందంగా అక్కడి పచ్చదనాన్ని చూస్తూ ఉండిపోతారు.

ఈ క్రమంలో ఏలూరు జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ నుంచి 14 మందికి పైగా వైద్య విద్యార్థులు ఈ రోజు ఆదివారం జలతరంగిణి జలపాతం వీక్షించడానికి టూరు వచ్చారు. ఈ క్రమంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఈ జలపాతంలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు గల్లంతయ్యారు. మొదటగా ఐదుగురు విద్యార్థులు కొట్టుకుపోగా.. స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఇద్దరు యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version