ఇండియన్ ఐటీ సంస్థలలో మూడు మిలియన్ల ఉద్యోగాలు కోల్పోనున్నారు..

-

ఆటోమేషన్ చాలా వేగంగా జరుగుతుండటంతో, 16 మిలియన్లకు పైగా ఉద్యోగులున్న దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు 2022 నాటికి 3 మిలియన్ల మంది వరకు భారీగా తగ్గించుకుంటాయి. ఇలా చేయడం వలన 100 బిలియన్ డాలర్లను ఆదా చేయడానికి అవుతుంది. దేశీయ ఐటి రంగంలో సుమారు 16 మిలియన్లు పని చేస్తున్నారు.

 

అయితే వీరిలో సుమారు 9 మిలియన్లు వాళ్ళు తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు మరియు బిపిఓ లో పని చేస్తున్నారని నాస్కామ్ తెలిపింది. అయితే ఈ 9 మిలియన్ల తక్కువ నైపుణ్యం కలిగిన సేవలు మరియు బిపిఓ పాత్రల లో, 2022 నాటికి 30 శాతం లేదా 3 మిలియన్లు మంది వరకు తగ్గించుకుంటారని తెలుస్తోంది.

కేవలం ఆర్‌పిఎ వలన మాత్రమే 0.7 మిలియన్ మంది రీప్లేస్ చేయబడతారు. భారతదేశ ఆధారిత వనరులకు సంవత్సరానికి 25 వేల డాలర్లు మరియు యుఎస్ వనరులకు 50,000 డాలర్లు ఖర్చు చేస్తే, ఇది సుమారు 100 బిలియన్ డాలర్ల వార్షిక జీతాలు మరియు కార్పొరేట్‌లకు సంబంధించిన ఖర్చులను విడుదల చేస్తుంది.

ఇది ఇలా ఉంటే కేవలం ఆర్‌పిఎ అప్-స్కిల్లింగ్ వలన టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ మరియు ఇతరులు 2022 నాటికి తక్కువ నైపుణ్యం కలిగిన వాళ్ళని 3 మిలియన్లకు తగ్గించాలని యోచిస్తున్నారు.

రోబోట్లు రోజుకు 24 గంటలు పని చేయగలవు. కాబట్టి ఇది 10:1 వరకు గణనీయమైన పొదుపును సూచిస్తుంది అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే ఆర్‌పిఎ అంటే ఏమిటి అనేది చూస్తే.. ఇది ఎన్నో రకాలుగా సహాయం చేస్తుంది. సమయాన్ని తగ్గించడం మరియు ఖర్చును కూడా బాగా తగ్గిస్తుంది.

ఆఫ్‌షోరింగ్ దేశీయ ఐటి రంగాన్ని 1998 లో జిడిపి లో 1 శాతం నుండి నేడు 7 శాతానికి ఎదగడానికి సహాయపడింది. సాఫ్ట్‌వేర్ ఆఫ్‌షోరింగ్ 1970 మరియు 1980 లలో ప్రారంభమైంది. అయితే ఇంత భారీ ఆటోమేషన్ వున్నా, ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన జర్మనీ (26 శాతం కొరత), చైనా (7 శాతం), భారతదేశం (5 శాతం) కొరియా, బ్రెజిల్, థాయిలాండ్ మలేషియా మరియు రష్యా కార్మిక కొరతను ఎదుర్కొనే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది.

surplus labour ని దక్షిణాఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ కి రాబోయే 15 సంవత్సరాలు ఎదుర్కోవాల్సి వుంది.

సాంకేతిక పరిజ్ఞానం నడిచే అంతరాయాల వల్ల ఎక్కువగా భారతదేశం మరియు చైనా ఎదుర్కొంటున్నాయని.. దీని కారణంగా 85 శాతం ఉద్యోగాలను ప్రభావితం చేస్తుందని.. కెన్యా, బంగ్లాదేశ్ వంటి దేశాలలోలాగ అని రిపోర్ట్ ద్వారా తెలుస్తోంది.

skills disruption రిస్క్ భారతదేశం మరియు చైనా కి కలుగుతాయని.. ఆసియాన్, పెర్షియన్ గల్ఫ్ మరియు జపాన్ తక్కువ ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఉత్పాదకత వంటి రంగాల యొక్క తక్కువ / మధ్య-నైపుణ్యం కలిగి ఉండడం వలన అభివృద్ధి చెందుతున్న మార్కెట్ ఉద్యోగాలు ఆటోమేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. manufacturing peak భారతదేశం లో 2002 లో చూడడం జరిగింది. అలానే 1970 లో జర్మనీలో, 1990 లో మెక్సికోలో జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version