తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ పంజా విసురుతుంది. ప్రతి రోజు ఓమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుత ప్రజలను వణికిస్తుంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 3 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో రెండు ఓమిక్రాన్ కేసులు నాన్ రిస్క్ దేశాల నుండి వచ్చాయని ప్రకటించారు. అలాగే మరొక ఓమిక్రాన్ కేసు రాష్ట్రంలో నే ఒక ఓమిక్రాన్ సోకిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్ట్ ఓమిక్రాన్ వచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
వీటితో తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 44 కు చేరిందని వెల్లడించారు. కాగ ప్రస్తుతం 34 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు యాక్టివ్ గా ఉన్నాయని ప్రకటించారు. కాగ తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు రోజ రోజు కు పెరుగుతుండటం తో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రజలు అందరూ కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకుంటే ఓమిక్రాన్ వేరియంట్ ను కట్టడి చేయవచ్చని తెలిపారు.