మోడీ కీల‌క నిర్ణ‌యం.. సాయుధ బ‌ల‌గాల చ‌ట్టం ఎత్తివేతకు రంగం సిద్ధం

-

ఈశాన్య రాష్ట్రాల‌లో ఉండే సాయుధ బ‌ల‌గాల చ‌ట్టం – 1958 ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుటుంద‌ని తెలుస్తుంది. దాని కోసం ఇప్ప‌టికే అడుగులు వేస్తోంది. ఈశాన్య రాష్ట్రాల‌లో ఉండే సాయుధ బ‌ల‌గాల చ‌ట్టం ద్వారా భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప్ర‌త్యేక మైన అధికారాలు ఉంటాయి. దీంతో ప‌లు స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల నాగాలాండ్ లో ఈ భ‌ద్ర‌తా బ‌ల‌గాల చేతిలో 14 మంది సామాన్య పౌరులు మృతి చెందారు. దీంతో ఈ చ‌ట్టంపై పలు విమ‌ర్శలు వ‌చ్చాయి. అంతే కాకుండా భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ఉన్న ఈ ప్ర‌త్యేక అధికారాల‌ను తొల‌గించాల‌నే డిమాండ్ మ‌రో సారి ముందుకు వ‌చ్చింది.

దీంతో ఈ చ‌ట్టాన్ని ఎత్తివేసేందుకు కావాల్సిన అవ‌కాశాలను అధ్య‌యానం చేయ‌డానికి ఒక ఉన్నత స్థాయి క‌మిటీ వేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాగ‌ ఈ క‌మిటీ లో ఐదుగురు స‌భ్యులు ఉంటార‌ని నాగాలాండ్ ముఖ్య మంత్రి నియో ఫియు రియో తెలిపారు. ఈ క‌మిటీలో హోం మంత్రిత్వ శాఖ అద‌న‌పు కార్యద‌ర్శి, నాగాలాండ్ డీజీపీ, సీఎస్, అసోం రైఫిల్స్ ఐజీ, సీఆర్పీఎఫ్ నుంచి ఒక ప్ర‌తినిధి ఉంటారు. వీరు 45 రోజులు అధ్య‌య‌నం చేసి కేంద్రానికి సిపార్సు చేస్తుంది. ఈ సిపార్సుల‌తో కేంద్ర ప్ర‌భుత్వం ఈ చ‌ట్టం తొల‌గించాలా వద్దా అని నిర్ణ‌యం తీసుకుటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version