బిగ్ బ్రేకింగ్ : ముగ్గురు పాకిస్తాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్..!

-

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఇప్పటికే దీని బారిన పడి ఎంతో మంది మృతి చెందారు. తన, మన అనే బేధాలు దీనికి ఉండవు, కాబట్టి.. కల,మత, ప్రాంతాలకు అతీతంగా ఇది అందర్నీ బలి తీసుకుంటుంది. ఇప్పటికే దీని బారిన పడి ఎంతో మంది ప్రముఖులు చనిపోయారు. అయితే తాజాగా దీని ప్రభావం పాకిస్తాన్ క్రికెట్ జట్టు మీద పడింది. ముగ్గురు ఆటగాళ్లు కరోనా బారినపడినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సోమవారం అధికారికంగా ప్రకటించింది.

హైదర్ అలీ, హారిస్ రౌఫ్, షాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వెల్లడించింది. త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో తమ జట్టు ఆటగాళ్లకు రావల్పిండిలో కరోనా పరీక్షలు చేసింది పీసీబీ. ఈ పరీక్షల్లో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఈ ముగ్గురిలో మాత్రం ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపింది. కాగా పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాపిద్ అఫ్రిది ఇప్పటికే కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version