తిరుమలలో మరో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ లో వున్న యాత్రికుల వసతి సముదాయంలో రెండవ అంతస్థు నుంచి పడి మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. కడప టౌన్ చిన్న చౌక్ కి చెందిన శ్రీనివాసులు, కృష్ణవేణి దంపతుల రెండవ కుమారుడు సాత్విక్ శ్రీనివాస రాజు ప్రమాదవశాత్తూ రెండవ అంతస్థు పై నుంచి పడి మృతి చెందాడు.
శ్రీవారి దర్శనార్థం 13వ తేది కుటుంబంతో తిరుపతి కి చేరుకున్నాడు శ్రీనివాసులు. 14వ తేదిన తిరుపతిలో 16వ తేదీకి దర్శన టిక్కెట్టు తీసుకున్నాడు. ఇవాళ ఉదయం తిరుమల చేసారుకోని పద్మనాభ నిలయంలో లాకర్ పొందాడు శ్రీనివాసులు. అయితే వరహస్వామిని దర్శించుకున్న అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో పద్మనాభ నిలయానికి చేరుకున్నాడు శ్రీనివాసులు. సాయంత్రం 5 గంటల సమయంలో అన్నతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ పై అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడిన మూడు సంవత్సరాల సాత్విక్.. అశ్వని ఆసుపత్రిలో చికిత్స పోందుతు మృతి చెందాడు. దీంతో శ్రీనివాస్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.