గత కొన్ని రోజులుగా బ్యాంకుల పద్దతులు చాలా వరకు మారుతున్నాయి. రోజుకో కొత్త నియమాలు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అయోమయం చెందుతున్నారు. ఒక బ్యాంకుని మరో బ్యాంకులో విలీనం చేయడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఇంకా కలుగుతున్నాయి. విలీనం ఎందుకు చేసారనే విషయం చాలా మంది సామాన్యులకి తెలియనే తెలియదు. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో వస్తున్న అనేక మార్పులు ఖాతాదారులకి అర్థం కాకుండా ఉన్నాయి.
తాజాగా సరికొత్త మార్పు రానే వచ్చింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి విలీనం అయిన బ్యాంకుల పాసు పుస్తకార్లు, చెక్కులు పనిచేయవని తెలిసింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త బ్యాంకు పాసు పుస్తకాలనే వాడాలనీ, డబ్బులు తీసుకోవాలన్నా, చెక్కు ద్వారా ఇతరులకి డబ్బు ఇవ్వాలన్నా, పాత చెక్కు పుస్తకాలు చెల్లవని పేర్కొంది. అంటే ఇప్పటివరకు మీరు చేసిన లావాదేవీలు, ఏప్రిల్ 1వ తేదీ నుండి చేయడానికి వీలు లేదు. అప్పుడు కూడా చేయాలనుకుంటే కొత్త పాసు పుస్తకాలతో పాటు కొత్త చెక్ బుక్ తీసుకోవాల్సిందే.
విజయ బ్యాంక్, ఆంధ్రాబ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, సిండికేట్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంఖ్, అలహాబాద్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్, దేనా బ్యాంకు మొదలైన బ్యాంకుల భాతాదారులందరూ వారి పాత బ్యాంకు పుస్తకాలను పక్కన పడేసి, అవి వేటిలో విలీనం అయ్యాయో వాటి పాసు పుస్తకాలని తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులు యూనియన్ బ్యాంక్ పాసు పుస్తకాలని తీసుకోవాలి. ఆంధ్రాబ్యాంకు యూనియన్ బ్యాంకులో విలీనం అయ్యింది కాబట్టి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ నియమం అందరికీ వర్తిస్తుంది.