ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ తన సి5 ఎయిర్‌క్రాస్ ఎస్‌యూవీతో ఇండియన్ మార్కెట్ ముందుకు రావడానికి సిద్దం అవుతోంది. అలాగే దీని ధర రూ .5 లక్షల నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. గత కొన్ని నెలల్లో, భారతదేశంలో అనేక సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీలను విడుదల చేశారు, వీటి ధర సుమారు 5 లక్షలుగా ఉంది. అలా రిలీజ్ చేసిన కార్ లలో నిస్సాన్ మాగ్నైట్, కియా సోనెట్ మరియు కైగర్ ఉన్నాయి.
కాబట్టి రాబోయే నెల రోజుల్లో కంపెనీ దీనిని ఆవిష్కరించవచ్చు అని భావిస్తున్నారు. సిట్రోయెన్ ఎస్‌యూవీకి సి 21 అని పేరు పెట్టె అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఇది కంపెనీ నుండి గతంలో విడుదలయిన సి1ను రీప్లేస్ చేసి కొత్త ఎంట్రీ లెవల్ మోడల్ గా భర్తీ చేస్తుంది. ఇటీవల, ఈ ఎస్‌యూవీని పరీక్ష సమయంలో గుర్తించారు, ఉత్తర స్వీడన్‌లో చల్లని వాతావరణంలో ఎస్‌యూవీని పరీక్షించిన సమయంలో దీనిని గుర్తించారు.