2021 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కొత్త వేతన చట్టం అమల్లోకి రానున్న నేపధ్యంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగుల జీతం తగ్గనుంది. కొత్త వేతన చట్టం ప్రభావం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రధానంగా పడనుందని అంటున్నారు. కొత్త వేతన చట్టం ప్రకారం ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ మారుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై నేరుగా ప్రభావం పడనుంది. కొత్త వేతన చట్టం ప్రకారం బేసిక్ వేతనం 50 శాతంగా ఉండగా ఆలవెన్స్ లు 50 శాతం దాటకూడదు.
అయితే ఉద్యోగులకు బేసిక్ శాలరీ పెరగడం వల్ల ప్రావిడెంట్ ఫండ్ కంట్రిబ్యూషన్ కూడా భారీగా పెరగనుంది, దీంతో జీతంలో కోత పడనుంది. అయితే ఈ కొత్త వేతన చట్టం గురించి ఉద్యోగుల నుంచి భిన్నాభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. కొంత మంది ఈ చట్టం వల్ల ప్రయోజనం చేకూరుతుందని భావిస్తుంటే మరి కొంతమంది ఈ నిబంధనల వల్ల వేతనం తగ్గి ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావిస్తున్నారు.