Thug Life : కమల్ హాసన్ థగ్ లైఫ్ మూవీ నుంచి క్రేజీ న్యూస్..

-

మణిరత్నం దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న తాజా చిత్రం ‘థగ్‌ లైఫ్‌’.ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది.ఆస్కార్ విన్నర్ ఏఆర్‌ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు . థగ్‌ లైఫ్ చిత్రాన్ని కమల్ హాసన్‌-ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్‌, మద్రాస్ టాకీస్‌,రెడ్ జియాంట్ మూవీస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ‘థగ్ లైఫ్’ చిత్రంలో కమల్ హాసన్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది. రెండు సరికొత్త పాత్రలల్లో కనిపిస్తారని వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాలో కమల్ పాత్రలకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఆయన మూడు పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.3 పాత్రలను లింక్ చేస్తూ మణిరత్నం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ , తమిళ హీరో జయం రవి తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.ఇక కమల్ హాసన్ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తోన్న కల్కి 2898 ఏడీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version