ఖమ్మంలో జూ పార్క్ ఏర్పాటు చేస్తాం : మంత్రి తుమ్మల

-

కాంగ్రెస్ ఏడాది కాలంలో రెండవ సీఎంగా రేవంత్ ప్రభుత్వం లో అభివృద్ధి లో దూసుకుని వెళ్తున్నాము. అనేక ప్రభుత్వాల్లో, శాఖల్లో పని చేసిన సమయం లో జిల్ల ఆభివృద్ధి ద్యేయంగా పని చేశాను అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఏ సమస్యా వున్న పరిష్కరించాము. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన అధికారుల మార్పిడి, వరదల వల్ల కొంత కాలం ఇబ్బందులు ఏర్పడినప్పటికీ ఇప్పుడు పనులు స్పీడ్ అందుకున్నాయి. 500 ఎకరాల్లో వెలుగుమట్ల ఎకో పార్క్ అభివృద్ధి చేస్తున్నాం. జూ పార్క్ ను ఏర్పాటు చేస్తాం.

ఖమ్మం కు చారిత్రాత్మక మైన ఖిల్లా పై రోపు వే ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్ శిల్పా రామం మాదిరిగా వెలుగుమట్ల, ఖమ్మం ఖిల్లా ను తయారు చేస్తాం. కొత్త ఏడాది లో పనులు ఏర్పాటు చేస్తాం. 700 కోట్ల తో మున్నేరు ఖమ్మం లోకి రాకుండా చేస్తాం. 220 కోట్ల తో చెరువుల నుంచి ఖమ్మం లోకి వరద రాకుండా చేయనున్నాం. ఖమ్మం నగరం లో 220 కోట్లతో మంచినీటి సమస్య లేకుండా పథకం తీసుకువస్తున్నం. మెడికల్ కాలేజి నిర్మాణం చేయనున్నాం. స్వామి నారాయణ్ ద్వారా స్కూల్ నిర్మాణం చేస్తున్నాం. ప్రభుత్వ ఆధ్వర్యం లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నాం అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news