న్యాయ పోరాటం దిశగా టిక్ టిక్.. మరి ట్రంప్ మాట..?

-

టిక్‌టాక్‌ యాప్‌ను అమెరికాలో నిషేధించేందుకు ట్రంప్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఇక కోర్టులోనే అడ్డుకుంటామని ఆ సంస్థ స్పష్టం చేసింది. ట్రంప్‌ నిర్ణయాలను సవాలు చేస్తూ త్వరలోనే దావా వేయనున్నట్లు ప్రకటించింది.టిక్‌టాక్‌ యాజమాన్య హక్కులను అమెరికా సంస్థలకు బదిలీ చేయకపోతే నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికోసం తొలుత 45రోజుల గడువు ఇచ్చినప్పటికీ అనంతరం 90రోజులకు పొడగిస్తూ అమెరికా నిర్ణయం తీసుకొంది. ఈ సమయంలో ప్రభుత్వంతో సంప్రదింపుల కోసం అన్ని దారులు మూసుకుపోయినట్లు టిక్‌టాక్‌ అభిప్రాయపడింది.

టిక్‌టాక్‌ అమెరికా వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్‌ చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సామాజిక మాధ్యమ దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్ కూడా టిక్‌టాక్‌ కొనుగోలుకు ఆసక్తి చూపుతోంది. ఇక ఇప్పటికే ఈ యాప్‌పై నిషేధం ఉన్న భారత్‌లో దీన్ని సొంతం చేసుకునేందుకు రిలయన్స్‌ కూడా టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డాన్స్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version