నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలంలో గల అడవుల్లో పెద్దపులి సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాలకు పులి సంచరిస్తున్న విజువల్స రికార్డు అయ్యాయి.వాటిని ఫారెస్టు అధికారులు విడుదల చేశారు.ఈ క్రమంలోనే ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఒంటరిగా ఎవరూ అడవిలోకి వెళ్లొద్దని, మీకు సంబంధించిన పశువులు అడవిలోకి వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. రాత్రిళ్లు సైతం త్వరగా ఇంటికి చేరుకోవాలని ఆలస్యంగా వెళ్లేవారు ఒంటరిగా కాకుండా లైటు, కర్ర చేతిలో పట్టుకుని వెళ్లాలన్నారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు.
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతుంది.
దీంతో గ్రామా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. pic.twitter.com/XoSsf3NQNx
— ChotaNews (@ChotaNewsTelugu) November 15, 2024