జూన్ 4న కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు, తర్వాత ఘర్షణలు జరగకుండా పటిష్ఠ భద్రత కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రానికి 20 కంపెనీ బలగాలను కేటాయించామని వివరించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా, దేశీయంగా ఇప్పటివరకు ఆరు దశల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. చివరి దశ జూన్ 1న జరగనుంది. ఈ విడత 57 స్థానాల్లో ఓటింగ్ జరుగుతుంది.