కల్వకుంట్ల కుటుంబానికి టైం వచ్చేసింది: కాంగ్రెస్

-

దుబ్బాక ఎన్నికల కేవలం ఒక అభ్యర్థి ఎన్నిక మాత్రమే కాదు….తెలంగాణ భవిష్యత్ ఎన్నిక అని తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరినీ విజ్ఞపి చేస్తున్నా అని అన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన విజ్ఞప్తి చేసారు. వందల కోట్ల రూపాయల అవినీతికి టీఆరెస్ పాల్పడిందని పేర్కొన్నారు.

రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ కమర్షియల్ చేశారు. డబ్బులు-మద్యం ఎన్నికలు కేసీఆర్ చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల డబ్బుల మయం టీఆరెస్ పార్టీ చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. దుబ్బాక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తే కాంగ్రెస్ ఏ పోటికైనా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేసారు. రేపటి నుంచి నేను దుబ్బాకలోనే ఉంటా-ఎన్నికలు పూర్తి అయ్యే వరకు అందుబాటులో ఉంటా అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల భాద్యత పూర్తిగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అప్పగించామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version