ఇండక్షన్ స్టవ్ ని ఉపయోగిస్తున్నారా..? అయితే ఈ తప్పులు చెయ్యద్దు..!

-

చాలామంది ఇండక్షన్ స్టవ్ వంట చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ ధరలు ఎక్కువైపోవడంతో చాలా మంది ఇండక్షన్ స్టవ్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇండక్షన్ స్టవ్ మీద వంట కూడా చాలా ఈజీ.

కొత్తగా ఉపయోగించే వాళ్ళకి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు. కానీ అలవాటు అయిపోతే సులభంగా ఇండక్షన్ మీద వండుకోవచ్చు. అయితే ఇండక్షన్ స్టవ్ ని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి తప్పులు మాత్రం అస్సలు చేయొద్దు. ఇండక్షన్ స్టవ్ అనేది ఎలక్ట్రిసిటీ తో పనిచేస్తుంది కాబట్టి వీటికి కాస్త దూరంగా ఉంచాలి.

తడిగా ఉండే నేలపైన ఇండక్షన్ స్టవ్ ని పెడితే కరెంట్ పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రమాదం కాబట్టి చూసుకోండి.
వంట పూర్తి చేసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసి ఫ్లగ్ ని తొలగించండి.
అలానే మెటల్ వస్తువులను కాగితాలను ఇండక్షన్ స్టవ్ కి దగ్గరగా పెట్టకండి.
స్టవ్‌ని టీవీలు, కంప్యూటర్లకు దూరంగా ఉంచండి. మ్యాగ్నెటిక్‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌‌ వల్ల ఇవి పాడైపోయే అవకాశం ఉంది.
సిరామిక్ టైల్స్, సిమెంట్ ఫ్లోర్ పైన దీన్ని పెట్టాలి. వుడ్‌ ఫ్లోర్‌ పైన కూడా పెట్టుకోవచ్చు.
మెటల్‌ వాటి పైన మాత్రం పెట్టకూడదు.
ఈ పొయ్యి మీద స్టీలు, ఇనుప పాత్రలను మాత్రమే పెట్టాలి. ఇలా ఈ పొయ్యిని వాడే ముందు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Exit mobile version