టీమ్ ఇండియా ఖాతాలో మరో విక్టరీ.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం

-

టీ20 ప్రపంచకప్​లో టీమ్ ఇండియా ఖాతాలో మరో విక్టరీ చేరింది. ఇవాళ నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లోనూ ​భారత జట్టు ఘన విజయం సాధించింది. 56 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విక్టరీతో ఈ ప్రపంచకప్​లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నెదర్లాండ్స్​ చతికిలపడింది.నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 123 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టులో బ్యాటర్లందరూ విఫలమయ్యారు. టిమ్‌ ప్రింగ్లే 20, కోలిన్ అకరమన్‌ 17 పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌, అర్షదీప్‌, అక్షర్ పటేల్‌, అశ్విన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. షమికి ఒక వికెట్ దక్కింది.

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్​ఇండియా 179/2 స్కోరు చేసింది. ఈ మ్యాచ్​తో కెప్టెన్‌ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు. 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 53 రన్స్​తో ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడాడు. విరాట్ కోహ్లీ (62*: 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (51*: 25 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధశతకాలతో అదరగొట్టారు. కేఎల్ రాహుల్‌ (9) మరోసారి నిరాశపరిచాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version