మొబైల్ డేటా స్లోగా ఉన్నప్పుడు ఈ టిప్స్ ట్రై చేయండి..

-

ఇంట్రెస్టింగ్​గా మొబైల్​లో ఓ సినిమా చూస్తున్నాం. మంచి సీన్ వస్తున్న సమయంలో బఫర్ అయితే ఎలా అనిపిస్తుంది. ఫోన్ నేలకేసి కొట్టాలనిపిస్తుంది కదా. కానీ అలా చేయకండి ఎందుకంటే అది మీ మొబైల్. పాడైపోతే మళ్లీ కొనడం కాస్త కష్టం. ఇలా చాలాసార్లు మనం డేటా ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటుంటాం. మొబైల్​లో ఏదైనా వర్క్ చేసి ఫైల్ సేవ్ చేసే మూమెంట్​లో సేవ్ అయ్యే కంటే ముందే బఫర్ అయి రీలోడ్ అని కనిపిస్తే వచ్చే కోపం మామూలుగా ఉండదు. డేటా స్లోగా ఉండటం వల్లే ఈ సమస్యలన్ని. మరి ఈ చిక్కులు మీకు రాకుండా కొన్ని జాగ్రత్తలు పాటించండి. ఈ చిట్కాలు పాటిస్తే మీ డేటా సూపర్ స్పీడ్​గా వస్తుంది.

మీ ఫోన్​లో డేటా స్లోగా ఉన్నప్పుడు ఓసారి ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి. ఒక 30 సెకన్లు అలాగే ఉంచి తర్వాత ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల మొబైల్ నెట్​వర్క్ రీసెట్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత మీ నెట్ సూపర్ ఫాస్ట్​గా వస్తుంది.

మొబైల్ డేటా నెట్‌వర్క్‌లు సిమ్​ ఆధారంగా మూడు, అంతకంటే తక్కువ నెట్‌వర్క్ ఎంపికలను అందిస్తాయి. వాటిలో 2G, 3G,  4G ఉంటాయి. కొన్ని సందర్భాల్లో 4G నెట్‌వర్క్ అందుబాటులో ఉండవచ్చు. కానీ 2G/3G నెట్‌వర్క్ మంచి వేగాన్ని అందించవచ్చు. సెట్టింగ్‌లలో మొబైల్ డేటా విభాగానికి వెళ్లి 2G/3G/4G ఆటోకు మారాలి. ఈ సెట్టింగ్ ద్వారా అందుబాటులో ఉన్న మంచి నెట్‌వర్క్‌ను గుర్తించి అందిస్తుంది. డేటా స్పీడ్‌ పెంచుతుంది.

నెట్​వర్క్​ సరిగ్గా రానప్పుడు చాలా మంది చేసే పని మొబైల్ రీస్టార్ట్ చేయడం. మొబైల్ రీస్టార్ట్ చేయడం వల్ల నెట్​వర్క్​తో సహా సిస్టమ్ పూర్తిగా రీస్టార్ట్ అవుతుంది. నెట్​వర్క్​ సమస్యలు తొలగిపోయి నెట్​ స్పీడ్​గా వస్తుంది.

SIM కార్డ్ దాని పోర్ట్‌లోకి వెళ్లినప్పుడు దుమ్ము పట్టుకుంటుంది. అప్పుడు నెట్ తో పాటు కాల్స్ కు సంబంధించి సమస్యలు వస్తాయి. ఆ సమయంలో సిమ్ కార్డును బయటకు తీసి గుడ్డతో క్లీన్ చేయాలి. మళ్లీ ఇన్ సర్ట్ చేయాలి. అప్పుడు నెట్వర్క్ స్పీడ్ గా పనిచేస్తుంది.

APNని రీసెట్ చేయడం ద్వారా నెట్ స్పీడ్ గా పని చేస్తుంది. ఇందుకోసం నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి..  ప్రొవైడర్ పేరుపై క్లిక్ చేయాలి. యాక్సెస్ పాయింట్ నేమ్స్  ఎంపిక చేసుకోవాలి. ‘రీసెట్ యాక్సెస్ పాయింట్స్ ఆప్షన్ ని ఎంచుకోవాలి. మొబైల్​ను రీస్టార్ట్ చేసి డేటా వాడుకోవాలి.

నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేయండి.. మొబైల్​ను ఫ్యాక్టరీ రీసెట్ లేదంటే ఫార్మాటింగ్ లాగానే, చాలా ఫోన్లు నెట్‌వర్క్ సెట్టింగ్‌లను రీసెట్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇందుకోసం సెట్టింగ్‌లు, బ్యాకప్, రీసెట్ మెనూకి వెళ్లాలి. తర్వాత, రీసెట్ నెట్‌వర్క్ సెట్టింగ్‌ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు నెట్ బాగా వస్తుంది.

నెట్‌వర్క్ సెట్టింగ్‌లకు వెళ్లి, డేటా వినియోగాన్ని చూడాలి. డేటా పరిమితి ఎంపిక ఉంటుంది. దాన్ని నిలిపివేయాలి. ఈ సారి నెట్​ స్లోగా ఉన్నప్పుడు చిరాకు పడకుండా ఈ చిట్కాలు ట్రై చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version