తిరుమలలో కల్తీ నెయ్యి కాంట్రవర్సీ.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

-

ఏపీలోని తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో లడ్డూ ప్రసాదం కల్తీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ ఘటనపై అనేక రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాయి. ఆయా రాష్ట్రాల్లోని ఆలయాల్లో ప్రసాదం తయారీపై నాణ్యతపై దృష్టి సారించాయి.ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. శ్రీవారి లడ్డూ తయారీకి గత వైసీపీ ప్రభుత్వం కల్తీ నెయ్యి వాడిందనే విషయం వెలుగులోకి రావడంతో ఇక్కడి ఆలయాల్లో ఏం జరుగుతుందోననే విషయంపై రాష్ట్ర సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రసాదం తయారీలో ఎటువంటి పదార్థాలు, ఎలాంటి నెయ్యి వాడుతున్నారు? అని ఆరా తీసింది.

దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో వినియోగించే నెయ్యి,ఇతర ఆహార పదార్థాలను తనిఖీ చేసి ల్యాబ్స్‌కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక పై లడ్డూలు, ప్రసాదాల తయారీకి ప్రభుత్వ పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య ఆధ్వర్యంలోని విజయ డెయిరీ నుంచే నెయ్యి,పాలను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది.ఇప్పటివరకు ఆలయాల ప్రతినిధులు కమీషన్ల కోసం ప్రైవేటు సంస్థల నుంచి వీటిని కొనుగోలు చేశారని తెలియడంతో రేవంత్ సర్కార్ వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో విజయ డెయిరీ నెయ్యికి డిమాండ్ ఒక్కసారిగా పెరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version