రేపట నుంచి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలను జరుపనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. వాహన సేవలు ప్రతీ రోజు ఉదయం 9 గంటలకు, సాయంత్రం 7 గంటకు నిర్వహిస్తామని తెలిపారు. గరుడ వాహన సేవలను రాత్రి 7.30 గంటలకు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ తీవ్రత కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఏకాంత బ్రహ్మోత్సవాలు కావడంతో స్వర్ణరథం, మహారథం బదులుగా సర్వభూపాల వాహన సేవలను నిర్వహిస్తామన్నారు. చక్రస్నాన సేవలను ఆలయంలోని అద్దాల మహల్ లో నిర్వహిస్తామని తెలిపారు.
రేపటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు – చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.
-