తిరుమలలో ఓ వ్యక్తి హల్ చల్.. గోగర్భం డ్యాం పై నుండి దూకేందుకు ప్రయత్నించిన భక్తుడు
నరేంద్ర అనే వ్యక్తికి సిగరెట్ త్రాగే అలవాటు ఉండడంతో, రెండు రోజులుగా సిగరెట్ త్రాగేందుకు వీలు లేక పోవడంతో ఒక్కసారిగా గోగర్బం డ్యాం వద్దకు చేరుకున్న నరేంద్ర డ్యాంలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు… pic.twitter.com/0KBvnyjg8s
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2023
తిరుమలలో శ్రీవేంకటేశుని దర్శించుకోవడానికి దేశదేశాల నుండి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. కాగా ఇప్పుడు దర్శనానికి సమయం ఎక్కువగా తీసుకొంటోంది. అందుకే భక్తులు ప్రియ దర్శనం కోసం షెడ్ లలో రోజుల అపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి వస్తోంది. కాగా ఈ రోజు దర్శనం కోసం వచ్చిన నరేంద్ర అనే ఒక భక్తుడు ఆత్మహత్యకు ప్రయత్నించడం ఇప్పుడు సంచలనంగా మారింది. తిరుమలలో ఉన్న గోగర్భ పై డ్యామ్ నుండి దూకి చనిపోవడానికి ప్రయత్నించాడు. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం నరేంద్రకు సిగరెట్ తాగే అలవాటు ఉండడం… రెండు రోజులుగా సీగరెట్ లేకపోవడం తో మనస్తాపము చెందిన నరేంద్ర ఆత్మహత్యకు ప్రయత్నించాడు.