తిరుపతి టు షిర్డీ టూర్… వావ్ ఈ ప్రదేశాలని సరదాగా చూసి వచ్చేయచ్చు..!

-

వేసవి సెలవల్లో ఎక్కడికైనా వెళ్లాలని మీరు అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. చక్కగా ఈ ప్యాకేజీ తో షిర్డీ వెళ్లి వచ్చేయచ్చు. తిరుపతి నుంచి షిర్డీకి సరికొత్త ప్యాకేజీ ని ఐఆర్‌సీటీసీ టూరిజం తీసుకు వచ్చింది. ఇక ఈ ప్యాకేజీ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. “సాయి సన్నిధి ఎక్స్ తిరుపతి” పేరుతో ఈ టూర్ ప్యాకేజీ ని ఆఫర్ చేస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. రైలు మార్గం లో షిరిడీకి తీసుకెళ్లి సాయిబాబా దర్శనానికి తీసుకు వెళ్లారు. శనిశిగ్నాపూర్ కూడా వెళ్లి రావచ్చు. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.

ప్రస్తుతం ఈ టూర్ మే 30, 2023వ తేదీన అందుబాటులో ఉంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఉదయం 8.30 నిమిషాలకు జర్నీ మొదలు అవుతుంది. రాత్రి అంతా జర్నీ ఉంటుంది. ఉదయం 7.55 నిమిషాలకు నాగర్ సోల్ కి రీచ్ అవుతారు. అక్కడ నుండి షిర్డీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయ్యాక షిర్డీ దర్శనం ఉంటుంది. మధ్యాహ్నం శనిశిగ్నాపూర్ కి రీచ్ అవుతారు. ఆ తరవాత షిర్డీకి వస్తారు.

హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. నాగర్ సోల్ చేరుకుని రాత్రి 09.30 నిమిషాలకు తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.10 నిమిషాలకు జర్నీ మొదలు అవుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఆ తరవాత మూడో రోజు రాత్రి 10.10 నిమిషాలకు తిరుపతి రైల్వే స్టేషన్ కి రీచ్ అవ్వడం తో టూర్ ప్యాకేజీ ఎండ్ అవుతుంది. సాయి సన్నిధి టూర్ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. కంఫర్ట్ క్లాస్‌లో సింగిల్ అక్యూపెన్సీనికి 12,040 చెల్లించాలి. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.8,380, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.7240 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్ లో అయితే సింగిల్ అక్యుపెన్సీకి రూ. 9210 కట్టాలి. ట్రిపుల్ అక్యుపెన్సీకి రూ. 4410గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version