తిరుపతి లడ్డూ, వడ ఎలా తయారుచేస్తారో తెలుసా?

-

తిరుమల తిరుపతి అంటే చాలు తెలియన ఆధ్యాత్మిక వాదులు ఉండరు. అందులోనూ శ్రీవేంకటేశ్వరుడి దివ్యదర్శనం తర్వాత స్వామి ప్రసాదం అందరికీ అత్యంత ప్రీతిపాత్రమైనవి. అయితే స్వామి వారికి నివేదించి, భక్తులకు పంచిపెట్టే లడ్డూ చాలా ప్రశస్త్యమైనది. ఇటీవల ఈ లడ్డూకు జీఐ గుర్తింపు సైతం వచ్చింది. ప్రపంచంలోనే పేరుగాంచిన లడ్డూ తిరుపతి లడ్డూ. మరో ప్రసాదం వడ. అయితే వీటిని ఎలా తయారుచేస్తారు.. దానిలో ఏయే పదార్థాలను ఎంత తూకంలో వాడుతారు వంటి విషయాలను తెలుసుకుందాం….

తిరుపతి లడ్డూ
కావలసిన పదార్థాలు: శనగ పిండి – 100 గ్రా.; పంచదార – 200 గ్రా.; జీడి పప్పు పలుకులు – 3 టేబుల్ స్పూన్లు; కిస్‌మిస్ – 2 టేబుల్ స్పూన్లు; ఏలకులు – 4; మిశ్రీ (పటిక బెల్లం చిప్స్) – 50 గ్రా.; పచ్చ కర్పూరం – 2 బిళ్లలు

తయారీ ఇలా!! ఒక పాత్రలో సెనగ పిండి వేసి, తగినన్ని నీళ్లు పోసి బూందీ తయారుచేయడానికి అనువుగా ఉండేలా కలపాలి మీద బాణలి ఉంచి వేడయ్యాక, నెయ్యి వేసి కరిగించాలి బూందీ చట్రంలో వేసి దూయాలి వేగిన తరవాత ఒక పాత్రలోకి తీసుకోవాలి నేతిలోనే జీడిపప్పులు, కిస్‌మిస్ వేసి బాగా వేయించి తీసి పక్కన ఉంచాలి పాన్‌లో పంచదార, ఒక కప్పు నీళ్లు వేసి కరిగించి, ఉడకగానే ఆ పాకాన్ని బూందీ మీద వేయాలి (తీగ పాకం కూడా రాకూడదు) లోగా ఏలకులు, పచ్చ కర్పూరాన్ని చిన్న రోట్లో వేసి నలపాలి (మొత్తం పొడి కాకుండా చూడాలి). బూందీలో వేసి బాగా కలిపాక, వేయించిన జీడిపప్పులు, కిస్‌మిస్‌లు జత చేసి బాగా కలపాలి లడ్డూలు తయారుచేసి, దేవునికి నైవేద్యం పెట్టాలి లడ్డూ రుచి ఇంచుమించు తిరుపతి లడ్డూ రుచిని పోలి ఉంటుంది.

తిరుపతి వడ తయారీ తెలుసుకుందాం!!
కావలసిన పదార్థాలు: మినుములు (పొట్టుతో) – ఒకటిన్నర కప్పులు; జీలకర్ర – ఒకటిన్నర టీ స్పూన్లు; మిరియాలు – ఒకటిన్నర టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు; నెయ్యి – పావు కప్పు
ఇలా చేస్తే వడ రెడీ!

ముందుగా మినప్పప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లలో సుమారు ఐదు గంటలపాటు నానబెట్టాక, నీటిని శుభ్రంగా ఒంపేసి, మిగిలిన నీరు కూడా పోయేలా రంధ్రాలున్న పాత్రలో పోసి పావు గంటసేపు పక్కన ఉంచాలి మిక్సీలో జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి మెత్తగా చేయాలి జత చేసి (రెండు మూడు టేబుల్ స్పూన్ల నీళ్లు మాత్రమే జత చేయాలి) మెత్తగా కాకుండా, కొద్దిగా పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టాలి మిశ్రమం గట్టిగా, జిగురుగా ఉండాలి మీద బాణలిలో నెయ్యి వేసి కాచాలి ఆకుకి కొద్దిగా నెయ్యి పూయాలి నీటిలో ముంచి, కొద్దిగా పిండి తీసుకుని అరటి ఆకు మీద చేతితో బాగా పల్చగా ఒత్తి, నేతిలో వేసి వేయించాలి ఒత్తితే నేతిలో వేగడానికి చాలా సమయం పడుతుంది మధ్యస్థంగా ఉంచాలి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి ఎక్కువగా పీల్చుకున్నట్టు అనిపిస్తే, వడలను రెండు గరిటెల మధ్య ఉంచి గట్టిగా నొక్కి నూనె తీసేయాలి) నైవేద్యం పెట్టి, ప్రసాదంగా తీసుకోవాలి.

ఇలా తిరుపతి లడ్డూలను, వడలను తయారుచేయాలి. అయితే వీటిని మొదట స్వామి వారికి నివేదించి భక్తితో ఆరగిస్తే పుణ్యం, పురుషార్థంతోపాటు జిహ్వచాపల్యం తీరుతుంది. ఏది ఏమైనా స్వామి వారి దేవాలయంలో తయారైన లడ్డూ రుచి మాత్రం మనకు సాధ్యం కాకపోయినా అనన్యమైన భక్తితో పైన చెప్పిన విధంగా తయారుచేస్తే చాలా మంచి రుచి వస్తుందని తిరుమల పాక శాస్త్ర నిపుణుల అభిప్రాయం. ఓం నమో వేంకటేశాయ!!

Read more RELATED
Recommended to you

Exit mobile version